మోదీని అనుకరించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీని అనుకరించారా? భారతీయ యాసలో మాట్లాడి మోదీ వ్యాఖ్యలు ఉటంకించారా? అవుననే అంటోంది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక. ఈ పత్రిక సంచలనాత్మక విషయాన్ని వెల్లడించింది. గత ఏడాది జూన్‌లో మోదీ అమెరికా వెళ్లారు. ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్‌తో పలు అంశాలపై చర్చించారు. ఆఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఆ సమయంలో మోదీ ట్రంప్‌ను ఉద్దేశించి, అమెరికా ఏలాంటి లాభాపేక్ష లేకుండా అఫ్గాన్‌కు ఎంతో చేస్తోందని కితాబిచ్చారు. ఆఫ్గాన్‌ను మోసగించి, అమెరికా లాభపడుతోందని భావిస్తున్న ప్రపంచ దేశాలకు మోదీ అన్న వ్యాఖ్యలను ట్రంప్ వినిపిస్తున్నారని, ఆ క్రమంలో భారత ప్రధాని వ్యాఖ్యలను ఆయన అనుకరించాలని వాషింగ్టన్ పోస్టు తన కథనంలో పేర్కొంది.













