డొనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బ
జార్జ్ ఫ్లాయిడ్ దారుణ హత్య అనంతరం అమెరికాలో చెలరేగిన నిరసనలను అణచివేసేందుకు సైన్యాన్ని రంగంలో దించుతానని హుంకరించిన డొనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకత ఎదురయింది. ఫ్లాయిడ్ మృతిపట్ల ట్రంప్ భార్య మెలనియా సంతాపం వ్యక్తం చేయగా, వారి చిన్నకుమార్తె టిఫానీ ఆఫ్రో అమెరికన్లకు సంఘీభావం వ్యక్తం చేశారు. సైనాన్యికి అంతర్గత శాంతిభద్రతల పని అప్పచెప్పడం సబబు కాదని అమెరికా రక్షణ మంత్రి ఎస్పర్ చెప్పారు. గవర్నర్లు, మేయర్లు ట్రంప్ మాటల్ని తప్పుపట్టారు. మరింతమంది నేషనల్ గార్డులను రంగంలో దించేలా గవర్నర్లపై ఒత్తిడి తెచ్చేందుకే ట్రంప్ అలా అన్నారని, ఇప్పటికిప్పుడు బలగాలను రంగంలో దించే యోచన ఆయనకు లేదని శ్వేతసౌధం సీనియర్ అధికారి వెల్లడించారు.













