రాష్ట్ర ఆదేశాల్ని ఉల్లంఘిస్తూ అధ్యక్షులు ట్రంప్ ఇండోర్ సమావేశాలు
అధ్యక్షులు ట్రంప్ మరియు ఆయన అనుచరులు ఇండోర్ సమావేశాలను 50 కంటే తక్కువ మందికి పరిమితం చేసే రాష్ట్ర ఆదేశాన్ని ఉల్లంఘిస్తూ 13 సెప్టెంబర్ ఆదివారం రాత్రి లాస్ వెగాస్ శివారులోని ఒక తయారీ కర్మాగారంలో వేలాది మంది అధ్యక్షులు ట్రంప్ మద్దతుదారులు తో ఒక ఇండోర్ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ లో ఎక్కువ మంది మాస్కులు ధరించలేదు మరియు సామాజిక దూరాన్ని పాటించకపోయినా అధ్యక్షుడు ట్రంప్ మరియు అతని అనుచరులు ఈ ఇండోర్ ర్యాలీ నిర్వహించిన తర్వాత ఇండోర్ ర్యాలీలు నిర్వహించటం వారి హక్కు గా సమర్ధించుకున్నారు అని న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది. అధ్యక్షులు ట్రంప్ “నేను వేదికపై ఉండగా, అది చాలా దూరంలో ఉంటుంది,” అని కోవిడ్ -19 ని ఉద్దేశించి ప్రసంగించడం మరియు అధ్యక్షులు ట్రంప్ స్వంత ఆరోగ్య భద్రత పై, “నేను అస్సలు ఆందోళన చెందలేదు.” అని చెప్పటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది అని న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.
విస్కాన్సిన్ మరియు మిన్నెసోటాలో రాబోయే అధ్యక్షులు ట్రంప్ ర్యాలీలు బహిరంగ విమానాశ్రయ హాంగర్ల లో నిర్వహించటానికి ప్రణాళిక రూపొందించబడింది అని, అయితే ఈ సమావేశాలు 50 కంటే తక్కువ మందికి పరిమితం చేసే రాష్ట్ర మార్గదర్శకాలను ఉల్లంగించేవిధంగా ప్రణాళికను రూపొందించినట్టు తెలిసింది. అధ్యక్షులు ట్రంప్ ప్రచార ప్రతినిధి టిమ్ ముర్తాగ్ ఇండోర్ ర్యాలీని కొనసాగించే నిర్ణయాన్ని సమర్థిస్తూ కాసినోలలో జూదం ఆడే వ్యక్తులపై లేని నిరసన అమెరికా అధ్యక్షుడి సమావేశానికి ఎందుకు అని ప్రశ్నించారు.
కానీ కొంతమంది సహాయకుల వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం కోవిడ్ -19 పరిస్థితుల్లో రాజకీయం గా ఇండోర్ ర్యాలీలు నిర్వహించడం అనేది రష్యన్ రౌలెట్ యొక్క ఆట అని అభిప్రాయపడ్డారు, ఇటువంటి సమావేశాల తో కోవిడ్ -19 పెరిగే అవకాశం ఉన్నందున ఆందోళన చెందుతున్నారు.













