నమస్తే కు ప్రపంచం ఫిదా!
కరోనా నేపథ్యంలో షేక్‌హ్యాండ్ (కరచాలనం)కు స్వస్తి చెప్పి భారత సాంప్రదాయ పలకరింపు నమస్తే ను దేశాధినేతలు అనుసరిస్తున్నారు. ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్తో భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నమస్తే తో పలకరించారు. బ్రిటన్ రాజకుమారుడు చార్లెస్ ఇటీవల సభికులతో కరచాలనం చేసేందుకు తొలుత ప్రయత్నించి ఆ తర్వాత అందర్నీ నమస్తే తో విష్ చేశారు. స్పానిష్ రాజు ఫిలిప్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ నమస్తే తో స్వాగతం పలికారు. అంతా నమస్తే ను పాటించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆ దేశ ప్రజలకు సూచించారు.













