డొనాల్డ్ ట్రంప్ ను ఆదుకున్న మెలానియా
బ్రిటన్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటీష్ రాణి రెండవ ఎలిజబెత్‌కు గత ఏడాది తాను ఇచ్చిన గిఫ్ట్‌నే గుర్తించలేకపోయారు. ఎలిజబెత్ రాణిని ట్రంప్, ఆయన సతీమణి మెలానియా సందర్శించినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. గత ఏడాది జూలైలో ట్రంప్ దంపతులు బ్రిటన్‌లో పర్యటించినప్పుడు వారు ఎలిజబెత్ రాణికి మిశ్రమ లోహంతో తయారు చేసిన ఒక గుర్రం (ప్యూటర్ హార్స్) విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు. కాగా ట్రంప్ దంపతులకు రాణి తమ బకింగ్హోమ్ ప్యాలెస్‌లోని పిక్చర్ గ్యాలరీలో ఉంచిన అమెరికాకు చెందిన జ్ఞాపికలను చూపించే సమయంలో ఆ గుర్రం విగ్రహాన్ని చూపించి ఇది గుర్తుందా అని ప్రశ్నించారు. అయితే ట్రంప్ దాన్ని గుర్తు పట్టలేకపోయారు. పక్కనే ఉన్న ఆయన భార్య మెలానియా వెంటనే కలుగ జేసుకుని దాన్ని మనం రాణికి కానుకగా ఇచ్చామని అనుకుంటూ అని సర్ది చెప్పడంతో ఆ ఇబ్బందికర పరిస్థితినుంచి ట్రంప్ బైటపడ్డారని ఇండిపెండెంట్ పత్రిక తెలిపింది.













