రెండుసార్లు ఓటు వేయండి : ట్రంప్
అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనితో ప్రతిపక్షాలు ఆయనపై ధ్వజమెత్తాయి. ఒక మీడియా చానల్‌తో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో రెండు సార్లు ఓటు వేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. మెయిల్ ఇన్ పద్ధతిలో ఓటు వేసిన తరువాత బ్యాలట్ పద్ధతిలో (పోలింగ్ కేంద్రంలో) కూడా ఓటు వేసిన తరువాత బ్యాలట్ పద్ధతిలో (పోలింగ్ కేంద్రంలో) కూడా ఓటు వేయాలని ఆయన సూచించారు. మెయిల్ ఇన్ పద్ధతి సరైనదే అయితే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి, ఓటు వేయలేరని ఆయన అన్నారు. కొందరు మెయిల్ ఇన్ పద్ధతిని సమర్థిస్తున్నారు. వారి వాదన సరైనదే అయితే మెయిల్ ఇన్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకున్నవారు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయలేరు అని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ట్రంప్‌పై విరుచకుపడ్డాయి. ట్రంప్ చట్టవ్యతిరేక కార్యక్రలాపాలను ప్రోత్సహిస్తున్నారని అవి ఆరోపించాయి. ఈ క్రమంలో వైట్ హౌస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ట్రంప్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరించాయని వైట్ హౌస్ పేర్కొంది. మెయిల్ ఇన్ పద్ధతిలో ఓటు వేయవలసిందిగా ట్రంప్ ప్రజలకు పిలుపు ఇచ్చారని.. అది సాధ్యం కాకపోతే పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయవలసిందిగా సూచించారని వైట్ హౌస్ వివరించింది.













