అదే నిజమైతే.. ఆ డీల్ నాకు నచ్చలేదు
అమెరికాలో టిక్‌టాక్ యాజమాన్య హక్కులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా అమెరికా కార్యకలాపాలను ఒరాకిల్ సంస్థ చేజిక్కించుకోనుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ట్రంప్ మెజారిటీ యాజమాన్య హక్కులు చైనా కంపెనీ చేతిలోనే ఉండటం తనకు నచ్చలేదని అభిప్రాయపడ్డారు. టిక్‌టాక్ అమెరికాలో యాజమాన్య హక్కులను ప్రముఖ సంస్థ ఒరాకిల్ సొంతం చేసుకోనున్నట్లు నాకు తెలిసింది. అయితే, మెజారిటీ యాజమాన్య హక్కులు మాత్రం చైనా కంపెనీ బైట్‌డాన్స్ చేతిలోనే ఉన్నట్లు నాకు తెలిసిది. అదే నిజమైతే ఆ డీల్ నాకు నచ్చలేదు. అయితే, ఇది కచ్చితంగా జాతీయ భద్రతను సంబంధించిన విషయం కావున, మరోసారి టిక్‌టాక్-ఒరాకిల్ డీల్‌ను పరిశీలిస్తా అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ డీల్ అంశం నా వద్దకు వస్తుందని అప్పుడు మరింత పరిశీలిస్తామని తెలిపారు.













