అమెరికాలో ఎమర్జెన్సీ ?
అమెరికాలో జాతీయ అత్యయిక పరిస్థితిని విధించనున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అక్రమ వలసలు, డ్రగ్స్ స్మగ్లింగ్లను నిరోధించడానికి మెక్సికో గోడ నిర్మించడం అత్యవసరమని ఎప్పటి నుంచో చెబుతున్నానని ట్రంప్ సృష్టం చేశారు. అందుకు అవసరమైన నిధులను కేటాయిస్తానని చెప్పారు. అయితే, ట్రంప్ చర్యను విపక్షం విమర్శిస్తోంది. అధ్యక్షుడికి ఉండే అధికారాలను దుర్వినియోగం చేయడమేనని స్పీకర్ నాన్సీ పెలోసీ దుయ్యబట్టారు. ఇదే అంశంపై ప్రతిష్టంభన ఏర్పడి, నిధులు విడుదల కాక ఉద్యోగులకు జీతాలు కూడా విడుదల కాని పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ట్రంప్ ప్రకటనతో మళ్లీ అధికార, విపక్షాల మధ్య యుద్ధవాతావరణం ఏర్పడనుంది.













