ప్రొటోకాల్స్ ను ఉల్లంగించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలిజెబెత్ -2 లు ఆందోళనల మధ్య మొదటిసారి సమావేశమయ్యారు. రాజవంశానికి చెందిన విండ్సర్ క్యాసిల్ కోటలో నిర్వహించిన తేనీటి విందులో ట్రంప్ పాల్గొన్నారు. బ్రిటన్ ప్రొటోకాల్ ప్రకారం రాణి ఎదుట తల వంచాలి. కాని ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ తలను వంచలేదు. అంతేకాకుండా ట్రంప్ విండ్సర్ క్యాసిల్‌కు నిర్ణీత సమయానికి రాకపోవడంతో 92 ఏళ్ల ఎలిజెబెత్ రాణి వారిని ఆహ్వానించేందుకు వేచివున్నారు. అలాగే ట్రంప్ సైనికుల గౌరవ వందనం స్వీకరించే సమయంలోనూ ఆమె కంటే ముందు నడిచారు. ప్రొటోకాల్ ప్రకారం రాణికి ముందుగా నడవకూడదు. రాణి పట్ల ట్రంప్ ప్రొటోకాల్ పాటించకపోవడంపై బ్రిటన్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌పై ఆగ్రహంతో అనేక మంది ట్వీట్స్ చేస్తున్నారు.













