ట్రంప్ వైఖరితో కల చెదురుతోంది…
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక విదేశీయులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విదేశీయులకు అమెరికా పౌరసత్వం ఇచ్చే విషయంలో ట్రంప్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. భారతీయుల్లో చాలా మంది అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు.. నైపుణ్య వీసా ద్వారా గ్రీన్‌కార్డు పొంది తద్వారా అమెరికా పౌరసత్వం సంపాదించే మార్గాన్ని ఎంచుకునేవారు. కానీ అమెరికా కార్పొరేట్ సంస్థలు స్థానికులవైపు చూస్తుండటంతో భారతనుంచి వలస వచ్చే ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంబీఏల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇక గ్రీన్‌కార్డు ప్రాసెస్ చేసేందుకు పట్టే కాలం ఏకంగా 7 నుంచి 8 ఏళ్లకు పెరిగింది. దీంతో భారతీయులు పౌరసత్వం కోసం ఎంతోకాలం ఎదురుచూడాల్సి ఉంటుంది.













