హెచ్ 1 బీ భాగస్వాములకు కష్టకాలం!
హెచ్ 1 బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారి జీవిత భాగస్వాములకు మరోసారి కష్టకాలం ఎదురైంది. వీరి పని అనుమతిని రద్దు చేసే విషయంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ సర్కార్ నేడు ఫెడరల్ కోర్టుకు తెలిపింది. హెచ్ 4 వీసాదారుల (హెచ్ 1బీ భాగస్వాములకు ఇచ్చే వీసా) పని అనుమతిని రద్దు చేస్తామని గత కొంతకాలంగా ట్రంప్ ప్రభుత్వం బహిరంగంగానే చెబుతోంది. తాజాగా మరో మూడు నెలల్లోగా దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నట్లు కోర్టుకు చెప్పింది. దీంతో హెచ్4 వీసాదారులు ఆందోళనకు గురవుతున్నారు.













