ఓ ఆకుకూరపై అమెరికా నిషేధం
అమెరికాలో నిత్యం వాడే లెట్టూస్ అనే ఆకుకూరపై నిషేధం విధించారు. విశేషించి రొమేన్ లెట్టూస్ అనే ఆకుకూరను వాడవద్దని అమెరికా సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) హెచ్చరికలు జారీ చేసింది. దాని వల్ల ఇ-కోలీ అనే బ్యాక్టీరియా వ్యాపిస్తున్నదని పేర్కొంటూ, అందువల్ల ఇంటిలో ఉన్న లెట్టూస్‌ను అందరూ బయట పారెయ్యాలని సీడీసీ ఓ ప్రకనటలో సూచించింది. చూడడానికి క్యాబేజీలా ఉండే లెట్టూస్‌ను సలాడ్‌గా ఉపయోగిస్తారు. లెట్టూస్‌ను తినడం వల్ల ఇ-కోలీ బారిపడిన కేసులు అమెరికావ్యాప్తంగా 32 వరకు నమోదయ్యాయి. కొన్నాళ్ల వరకు రోమేన్ లెట్టూస్ జోలికి అసలు పోవద్దని సీడీసీ సృష్టం చేసింది. కెనడా కూడా లెట్టూస్పై హెచ్చరికలు జారీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.













