తెలుగువాళ్ళంతా కలిసి సంబరాలు చేసుకోవడం ఆనందంగా ఉంది – అల్లు అర్జున్
అమెరికాలో వివిధ చోట్ల ఉన్న తెలుగువాళ్ళంతా నాట్స్ తెలుగు సంబరాల వేదికపై కలిసి సంబరాలు చేసుకోవడం చూస్తుంటే ఆనందంగా ఉందని సినీనటుడు అల్లు అర్జున్ అన్నారు. చికాగోలో నాట్స్ నిర్వహిస్తున్న తెలుగు సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్రాజు, కామెడి విలన్ సుబ్బరాజు, హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఈ సంబరాలకు వచ్చారు. నాట్స్ చైర్మన్ సామ్ మద్దాలి, ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ, సంబరాల కన్వీనర్ రవి ఆచంట వీరికి ఘనంగా స్వాగతం పలికారు.













