తానా ఆధ్వర్యంలో ముగ్గురు విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ
తానా ఆధ్వర్యంలో కర్నూలు నగరానికి చెందిన ముగ్గురు విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి సహకారంతో రూ. 1.50 లక్షలు విలువైన మూడు ల్యాప్టాప్లను తానా సభ్యులు విద్యార్థులకు అందజేశారు. కరోనా వైరస్ తీవ్రతతో ప్రతిభావంతులైన విద్యార్థులు కళాశాలలకు హాజరు కాలేక పలు ఇబ్బందులు పడుతున్నారని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, ఫౌండేషన్ ట్రస్టీ కోఆర్డినేటర్ సామినేని రవి తెలిపారు. వారి కోసం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆదరణ కార్యక్రమంలో భాగంగా డి. చందన సాయి, పూర? చరిత, మొహమ్మద్ అలీమ్లకు ల్యాప్టాప్లు అందజేసినట్లు చెప్పారు. ప్రతిభ గల విద్యార్ధినీ విద్యార్థులే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. కాగా.. ఈ ల్యాప్టాప్ల పంపిణీ కార్యక్రమంలో ముప్పా రాజశేఖర్, సందడి మధు తదితరులు పాల్గొన్నారు.













