మాట్లాడే ట్రంప్ రోబో!
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని డిస్నీ వరల్డ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోబోను తయారుచేసింది. డిస్నీ వరల్డ్‌లోని మాజిక్ కింగ్డమ్ పార్క్‌లో హాల్ ఆఫ్ ప్రెసిడెంట్స్ పేరిట అమెరికా అధ్యక్షుల రోబోలను తయారుచేస్తుంటారు. దీనిలో భాగంగా ఈ ఏడాది ట్రంప్ రోబోను తయారుచేసిన డిస్నీ ట్విటర్లో ఫోటోను విడుదల చేసింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ రోబోను తయారు చేయాలని డిస్నీ వరల్డ్ నిర్వాహకులు అనుకుంటున్నారు. ఇందుకోసం కొన్ని నెలల క్రితమే వైట్‌హౌస్ ప్రతినిధులను సంప్రదించి ట్రంప్ కొలతలు తీసుకున్నారు. ఈ పార్క్‌ను వచ్చే వారం సందర్శకుల కోసం తెరవనున్నారు. అయితే ఈ రోబో ట్రంప్ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఈ రోబోని చూస్తుంటే ట్రంప్‌లా లేరని హాలీవుడ్ నటుడు జాన్ వోయిట్లా ఉన్నారని కొందరు అంటుంటే మరికొంతరు ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌లా ఉందని కామెంట్లు గుప్పిస్తున్నారు. మొదటి నుంచి అమెరికా ప్రజలు నిర్దేశించిన దేశంగా పేరు పొందింది. అమెరికాకు స్వాతంత్య్రం రావడానికి అమెరికన్లే కృషిచేశారు అని రోబో ట్రంప్ మాట్లాడుతున్న వీడియో ఆకట్టుకుంది.













