NATS: నాట్స్ వేదికపై రాఘవేంద్రరావుకు ఘనసత్కారం
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావును నాట్స్ (NATS) 8వ తెలుగు సంబరాల్లో ఘనంగా సత్కరించారు. ఆయన సినీ ప్రస్థానాన్ని వివరిస్తూ ప్రదర్శించిన ఏవీ కూడా అందర్నీ ఆకట్టుకుంది. 50 ఏళ్ల దర్శక ప్రస్థానంలో వందకుపైగా చిత్రాలకు ఆయన దర్శకం వహించారు. ఇలా సినీరంగానికి ఎనలేని సేవ చేసిన రాఘవేంద్ర రావుకు నాట్స్ ప్రత్యేక అవార్డు అందజేసింది. నాట్స్ ప్రెసిడెంట్ గుత్తికొండ శ్రీనివాస్, కిశోర్ కాంతిపూడి, స్టార్ హీరోయిన్ శ్రీలీల, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ డైరెక్టర్ సుకుమార్, నిర్మాత దిల్ రాజు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ చేతుల మీదుగా రాఘవేంద్ర రావును నాట్స్ వేదికపై ఘనంగా సన్మానించి, ప్రత్యేక అవార్డును అందజేశారు. చిత్రపరిశ్రమకు తను ఇంట్రడ్యూస్ చేసిన అల్లు అర్జున్ (Allu Arjun), శ్రీలీల కూడా ఈ కార్యక్రమంలో ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు ఈ అవార్డు అందించిన నాట్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.







