NATS: నా దారిలో సుకుమార్ వచ్చారు. హిట్ ఇచ్చాడు…. నాట్స్ సంబరాల్లో రాఘవేంద్రరావు
ఫ్లోరిడాలోని టాంపా కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన నాట్స్ (NATS) సంబరాల్లో పాల్గొన్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనదైనశైలిలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ‘‘ నాది 50 ఏళ్ల దర్శక ప్రస్థానం. ఈ ప్రస్థానంలో ఎన్నో సినిమాలు తీశాను. ఎంతోమందికి సినిమారంగంలో రాణించే అవకాశం లభించింది. నేను పరిచయం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల ఇక్కడ ఉన్నందుకు నాకు ఆనందంగా ఉంది. దర్శకుడు సుకుమార్‌కు నాకు మధ్య ఒక పోలిక ఉంది. అదే గడ్డం (నవ్వులు). నేను ‘అడవి రాముడు’లో అడవిని నమ్ముకున్నా… స్టార్ డైరెక్టర్ అయ్యా. నువ్వు (సుకుమార్‌ని ఉద్దేశించి) ‘పుష్ప’లో అడవిని నమ్ముకున్నావు స్టార్ డైరెక్టర్ అయ్యావు. బన్నీని స్టార్ హీరోని చేశావు’’ అని అందరినీ నవ్వించారు. ఈ సందర్భంగా నాట్స్ నాయకులు రాఘవేంద్రరావును ఘనంగా సన్మానించారు.







