ట్రంప్ తో తొలి డిన్నర్ చేయనున్న ప్రధాని
అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి డిన్నర్ చేయనున్నారు. ఇలా ట్రంప్‌తో డిన్నర్ చేయనున్న తొలి విదేశీ నేతగా ప్రధాని మోదీ పేరు గడించనున్నారు. దాదాపు ఐదు గంటలపాటు ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ అవనున్నారు. ఒక నేతతో ఇంత పెద్ద సమయం భేటీ అవడం కూడా ట్రంప్‌కు ఇదే తొలిసారి. ఈ ఐదుగంటల కూడా ఎంతో సానుకూలంగా, స్నేహభావంతో ఉంటాయని, ఒకే కుటుంబాన్ని తలపిస్తాయని వైట్‌హౌస్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
దౌత్యపరమైన విషయాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాల విషయంలో చర్చ జరగనుంది. సోమవారం మధ్యాహ్నం తర్వాత 3.30 గంటల ప్రాంతంలో వీరిద్దరి మధ్య భేటీ జరగనుంది. అందులో భాగంగా కొద్ది సేపు మీడియా ముందు ఫోటో సెషన్, తర్వాత ఇరు దేశాల సంబంధాలపై ట్రంప్, మోదీ మధ్య చర్చలు అనంతరం కాక్టెయిల్ రిసెప్షన్ ఉంటుంది.













