NATS: సమాజానికి ఎంతో కొంత సేవ చేస్తూ ఉండండి: నాట్స్ వేదికపై దిల్‌రాజు
తెలుగులో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ చిత్రాలు అందించిన ప్రముఖ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు గారిని నాట్స్ 8వ తెలుగు సంబరాల్లో ఘనంగా సత్కరించారు. నాట్స్ (NATSS) సభ్యులు ప్రశాంత్ పినమనేని, శ్రీనివాస్ గుత్తికొండ చేతుల మీదుగా ఈ సన్మానం జరిగింది. తనను ఇలా సత్కరించిన నాట్స్‌కు దిల్‌రాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తను నిర్మించిన ‘ఆర్య’ చిత్రాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. ఆ చిత్రంలోని హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ కార్యక్రమంలో ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే ఎందరో వైద్యులను నాట్స్ సన్మానించిందంటే.. సమాజానికి సేవ చేయాలనే సందేశాన్ని ఇవ్వడానికే అని, కాబట్టి అందరూ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని సూచించారు.







