దేవ్‌లోక్ థీమ్ ను మెచ్చుకున్న కేంద్ర టూరిజం మంత్రి
తిరుపతిలో వివిధ ఆలయాల నమూనాలతో ఏర్పాటవుతున్న ఆధ్యాత్మిక థీమ్‌పార్క్ నమూనాను కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ మెచ్చుకున్నారు. ఈ థీమ్‌పార్క్ మేనెజింగ్ డైరెక్టర్ కె. అజయ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ రెడ్డి, ఢిల్లీలో కేంద్రమంత్రిని కలుసుకుని తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న థీమ్‌పార్క్ వివరాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా థీమ్‌పార్క్ కాన్సెప్ట్‌ను విన్న ప్రహ్లాద్పటేల్ ఆసక్తితో మరిన్ని వివరాలను తెలుసుకుని, ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని కోరారని, అలాగే భారత ప్రభుత్వం తరపున కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తానని కూడా హామి ఇచ్చినట్లు వారు తెలిపారు.













