బే ఏరియాలో దేవినేని ఉమ సమావేశం సక్సెస్
తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ బే ఏరియాకు వచ్చినప్పుడు ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఎన్నారై యూఎస్ఏ కో ఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలో మంత్రి దేవినేని ఉమ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆంద్రప్రదేశ్ని ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులను నుంచి గట్టెక్కించే సామర్థ్యం చంద్రబాబుకే ఉందని, రాష్ట్ర మేలు కోసం వచ్చే ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు కూడా టీడీపీ విజయానికి కృషి చేయాలని దేవినేని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్న ప్రజాప్రతినిధులను ప్రోత్సహిస్తూ ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్ మాఫియా గ్యాంగులను కాపాడే ప్రయత్నంలో ఉందని ఆరోపించారు. మూడు రాజధానుల ఏర్పాటు అసాధ్యమని తెలిసిన పాలన వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని అభూతకల్పనలు, అసత్యాలను చెబుతోందని విమర్శించారు. స్థానిక తెలుగుదేశం నాయకుడు వెంకట్ కోగంటి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.
తెలుగుదేశం నాయకులు శ్రీకాంత్ దొడ్డపనేని మరియ శశి దొప్పలపూడి ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులు అవలంభిస్తున్న అధునాతన విధానాలను ఆయన తెలుసుకున్నారు. చివరగా తెలుగుదేశం నాయకుడు భక్త బల్లా వందన సమర్పణ చేసారు. బే ఏరియా లోని ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు.
మాజీ టీడీపీ మీడియా మరియు గిడ్డంగుల చైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో సందీప్ ఇంటూరి, సూర్య, వీరబాబు, బెజవాడ శ్రీను, తిరుపతి రావు, సుబ్బా యంత్ర, వెంకట్ అడుసుమల్లి, కల్యాణ్ కట్టమూరి, రమేష్ కొండా, వీరు ఉప్పల, శాస్త్రి వెనిగళ్ల, వెంకయ్య జెట్టి, సతీష్ చిలుకూరి, సతీష్ అంబటి, శ్రీని వల్లూరిపల్లి, శ్రీకాంత్ దొడ్డపనేని, విజయకృష్ణ గుమ్మడి, సుధీర్ ఉన్నం, లీయోన్ రెడ్డి, శశి దొప్పలపూడి, గాంధీ పాపినేని, భరత్ ముప్పిరాల, ప్రసాద్ మంగిన, చంద్ర గుంటుపల్లి తదితరులు పాల్గొన్నారు.













