నాటా ఆధ్వర్యంలో శ్మశాన వాటికల అభివృద్ధి
గుంటూరు జిల్లా మున్నంగిలోని శ్మశాన వాటికలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్, నాటా కలిసి అభివద్ది చేశాయి. వీటిని నాటా ఈవీపీ అల్లా రామిరెడ్డి, శివ మేకా అందించిన రూ.13 లక్షల విరాళాలతో నాటా సేవా దినోత్సవాలు 2022 కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేశారు. ఈ అభివృద్ది పనుల ప్రాజెక్ట్.. అల్లా చంద్రశేఖర్ రెడ్డి, అరిగ వేమారెడ్డి, అల్లా సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తి చేయబడ్డాయి. తాజాగా ఈ శ్మశాన వాటికల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, నాటా ఈవీపీ ఆళ్ల రామిరెడ్డి, కార్యదర్శి నారాయణ రెడ్డి గండ్ర, కన్వీనర్ గిరీష్ రామిరెడ్డి, బోర్డు సభ్యుడు వెంకటరామిరెడ్డి, రాధాకృష్ణారెడ్డి కలువాయి, అశోక్ మోరా (ఆర్వీపీ), నాటా సేవా డేస్ ఇండియా కోఆర్డినేటర్ పార్ధసారధి రెడ్డి మంద, భీమిరెడ్డి పద్మావతి, స్థానిక నాయకులు అరిగ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.













