డిట్రాయిట్ లో జూన్ 4న సాహిత్య సదస్సు
డిట్రాయిట్ తెలుగు సమితి ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీ మధ్యాహ్నం ప్రముఖ రచయితులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6.30 వరకు డిట్రాయిట్ ఇండియన్ సెంటర్లో ఈ సమావేశం జరుగుతుంది. సాహిత్యంలో సామాజిక ఉద్యమాలు అన్న అంశంపై కొలకలూరి ఇనాక్ ప్రసంగిస్తారు. కవిత్వంలో కొత్త గాలి అన్న అంశంపై యాకూబ్, నా కథాయానంపై శివశంకర్, తెలుగు సాహిత్యం- సంపాదకత్వం అన్న విషయమై నవీన్, నేటి తెలుగు నవల – తీరుతెన్నులు అన్న అంశంపై రామ్మోహన్రావు ప్రసంగం ఉంటుందని నిర్వాహకులు చెప్పారు.













