డిట్రాయిట్ లో తెలుగు పండుగ సెప్టెంబర్ 29, 30 తేదీల్లో
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29, 30 తేదీల్లో 20ఏళ్ళ పండగ పేరుతో సదస్సులను ఏర్పాటు చేశారు. ఫర్మింగ్టన్హిల్స్లోని సెయింట్ తోమా చర్చిలో జరిగే ఈ సదస్సులకు ప్రముఖ సాహితీవేత్తలు హాజరవుతున్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సన్నాడి వెంకట రమేశ్, కాశీనాధుల రాధ, కళాగీత, గోపిరాజు లక్ష్మీ, బహుబత్తిని శ్రీనివాస్, మెట్టుపల్లి జయదేవ్, వేములపల్లి రాఘవేంద్ర, కూనపరెడ్డి గిరిజ, కొలినాల సురేష్, దుగ్గిరాల సుబ్బారావు, కల్పన రెంటాల, వంగూరి చిట్టెన్రాజు తదితరులు ఈ సదస్సులకు హాజరవుతున్నారు.













