దాసరికి నివాళులర్పించిన డిట్రాయిట్ ఎన్నారైలు
ప్రముఖ దర్శకుడు, సినీ దిగ్గజం దాసరినారాయణ రావు మృతిపట్ల డిట్రాయిట్లోని ఎన్నారైలు సంతాపం వెలిబుచ్చారు. ఫార్మింగ్టన్ హిల్స్ సెంచరీ బాంక్వెట్ హాల్లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఎంతోమంది హాజరయ్యారు. ప్రసంగించిన వక్తలు దాసరితో ఉన్న అనుబంధాన్ని, దాసరి గుణగణాలను, విశేషాలను అందరితో పంచుకున్నారు. రచయిత సూర్యదేవర రామ్మోహన్రావు చేసిన ప్రసంగర ఆకట్టుకుంది. సుధీర్ బచ్చు, సాయినీరుకట్టు, దంతేశ్వరరావు చల్లా, కిరణ్ దుగ్గిరాల, సునీల్ పంత్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జోగేశ్వరరావు పెద్దిబోయిన, నవీన్ ఎర్నేని, వెంకట్ ఎక్కా, చెంచురెడ్డి, బసవేంద్ర సూరపనేని తదితరులు పాల్గొన్నారు. శివరాం యార్లగడ్డ వందన సమర్పణ చేశారు.













