TANA: తానా 24వ మహాసభలకు రావడం చాలా సంతోషం: రఘురామకృష్ణం రాజు
తానా (TANA) 24వ మహాసభలకు ముఖ్యఅతిథిగా టీడీపీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు (Raghu Rama Krishnam Raju) హాజరయ్యారు. ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉందని, ఇప్పటికి తాను మూడుసార్లు తానా సెలబ్రేషన్స్‌కు వచ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తానా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోందని, వీటిని చేపడుతున్న వారందరినీ కలవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నారైల పాత్ర చాలా కీలకమని, గత ఎన్నికల్లో కూడా రెండు నెలల ముందే ఎంతోమంది రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేశారని గుర్తుచేసుకున్నారు. 2022లో కూడా తను రెండుసార్లు యూఎస్ వచ్చి ఎన్నారైలను కలిసినట్లు చెప్పారు. ఎన్నికల్లో తాము ఓటు వేయడంతోపాటు తమ చుట్టూ ఉన్న వారు కూడా ఓట్లు వేసేలా ఎన్నారైలు ప్రజల్లో అవగాహన కల్పించారని చెప్పారు.







