వర్జీనియా రాష్ట్రంలో అమరావతికి మద్దతుగా ప్రదర్శన
రాజధాని అమరావతికోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నారు. గత 365 రోజుల నుండి నిరంతరాయంగా ఉద్యమం చేస్తున్నారు. వారికి మద్దతుగా అమెరికా ఎన్నారైలు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు. వర్జీనియా రాష్ట్రంలోని హెర్న్ డన్ నగరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ హాజరయ్యారు. ఏరియా ప్రముఖుడు సతీష్ వేమన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు రైతుల అమరావతి పోరాటానికి మద్దతు తెలిపారు.













