అరిజోనాలో రిపబ్లిక్ పార్టీకి షాక్
అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అరిజోనా నుంచి పోటీ చేసిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి క్రిస్టెన్ సినేమా (42) గెలుపొందారు. 1994 తర్వాత తాజాగా ఈ ప్రాంతం నుంచి ఓ డెమోక్రటిక్ పార్టీ గెలుపొందడం గమనార్హం. ఈ ప్రాంతంలో రిపబ్లిక్ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ డెమోక్రటిక్ అభ్యర్థి గెలుపొందడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో గుబులు మొదలైంది. రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేసిన మార్తా మెక్‌సల్లీ ఓటమిపాలయ్యారు. క్రిస్టెన్ సినేమాకు న్యాయశాస్త్రంలో విశేష పరిజ్ఞానం ఉంది. సామాజిక కార్యకర్తగా ఆమె ప్రజల పక్షాన నిలిచారు. అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 20 ఏండ్ల వయసులో ఉన్నప్పుడే రాజకీయంలో అరంగేట్రం చేశారు. గ్రీన్ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం డెమోక్రటిక్ పార్టీలో చేరారు.













