రక్షణ శాఖా మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ మలేషియా పర్యటన
మలేషియా లో ని భారత హై కమీషనర్ హెచ్.ఈ . శ్రీ బి.న్ రెడ్డి గారు, గౌరవనీయులైన భారత ప్రభుత్వ రక్షణా శాఖా మంత్రి హెచ్.ఈ. శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారి గౌరవార్ధం మలేషియా లో నివసిస్తున్న భారత సంతతి కోసం ఈరోజు మాన్హట్టన్, బెర్జయ టైమ్స్ స్క్వేర్ హోటల్, కౌలాలంపూర్, మలేషియా లో విందును ఏర్పాటు చేశారు.
రక్షణ శాఖా మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ మలేషియా లో రెండు రోజుల అధికార పర్యటనలో ఉన్నారు. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం మరియు అభివృద్ధి చెందిన వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి సారించడానికి మలేషియా రక్షణ శాఖ మంత్రి దాతో శ్రీ మొహమ్మద్ హాసన్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో భాగంగా మలేషియా ప్రధాని దాతో శ్రీ అన్వార్ ఇబ్రహీం ని కూడా కలిశారు. ఈ సమయంలో మంత్రులిద్దరూ రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి కొత్త కార్యక్రమాల పై ఇరుపక్షాలు చర్చించారు.
భారతదేశం మరియు మలేషియా రెండు దేశాలు శాంతి మరియు శ్రేయస్సుపై ఆసక్తి కలిగి ఉన్నాయి అని రెండు ప్రజాస్వామ్యం దేశాలు బలమైన మరియు బహుముఖ సంబంధాన్ని కలిగి ఉన్నాయి అని ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఇరు పక్షాల రక్షణ మరియు భద్రతతో సహా అనేక వ్యూహాత్మక భాగస్వామ్య దృక్పథం ప్రకారం పని చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్, తెలుగు ఎక్సపెట్స్ అసోసియేషన్, ఆంధ్ర అసోసియేషన్, తమిళ్ అసోసియేషన్, సంత్ నిరంకారీ మిషన్, NRTIA మలేషియా, మలేషియా ఒడియా అసోసియేషన్, PIO మలేషియా మరియు ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.













