మోదీ, బైడెన్ భేటీలో కీలక అంశం ఇదే
రక్షణ రంగంలో పరస్పర సహకారం దిశగా భారత్, అమెరికాలు మరిన్ని ముందడుగులు వేయనున్నాయి. అమెరికాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం భారత్, అమెరికా చేతులు కలుపుతున్నాయి. మోదీ అమెరికా పర్యటనలో ఇదే అంశంపై విస్తృతంగా చర్చలు జరుగనున్నాయి. రక్షణ రంగంలో సహకారంపై ఇరు దేశాలు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ రోడ్డు మ్యాప్‌ను సైతం ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఆసియా`పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇకపై కలిసి పనిచేయాలని భారత్`అమెరికా ఇప్పటికే నిర్ణయించుకున్నాయి.






