ప్రియాంక, దీపికకు షాక్
బాలీవుడ్ ముద్దుగుమ్మలు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె ఈసారి ఫోర్బ్స్లో చోటు దక్కించుకోలేకపోయారు. ప్రముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2019 ఏడాదికి గాను ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న నటీమణుల జాబితాను విడదల చేసింది. ఇందులో హాలీవుడ్ బ్యూటీ స్కార్లెట్ జాన్సన్ అగ్రస్థానంలో నిలిచారు. 2018 ఫోర్బ్స్ జాబితాలోనూ అత్యధికంగా ఆర్జిస్తున్న నటిగా ఆమే ప్రథమ స్థానంలో ఉండటం విశేషం. స్కార్లెట్ నటిస్తున్న సినిమా బ్లాక్ విండో. ఈ చిత్రం కోసం ఆమె ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుంచి అధిక మొత్తంలో పారితోషికం తీసుకున్నారు. ఆమె 2019లో దాదాపు రూ.400 కోట్లు (56 మిలియన్ డాలర్లు) ఆర్జించారు. ఈ జాబితాలో రెండోస్థానంలో సోఫియా వర్గరా దాదాపు రూ.315 కోట్లు (44.4 మిలియన్ డాలర్లు) ఆర్జించి, రెండో స్థానంలో నిలిచారు. దాదాపు రూ.250 కోట్లతో (35 మిలియన్ డాలర్లు) రీస్ విథర్స్పూన్లో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. నికోల్ కిడ్మాన్, జెన్నీఫర్ అనిస్టన్ రూ.245 కోట్లు (34 మిలియన్ డాలర్లు), రూ.200 కోట్లు (28 మిలియన్ డాలర్లు) ఆర్జించి వరుసగా నాలుగు, ఐదు స్థానాలు సొంతం చేసుకున్నారు.
ఫోర్బ్స్లో 2019ల జాబితాలో ఒక్క బాలీవుడ్ నటి కూడా చోటు దక్కించుకోలేదు. 1 జూన్ 2018, 1 జూన్ 2019 మధ్య కాలంలో ప్రపంచంలో అత్యధికంగా ఆర్జించిన నటుల జాబితాను ఇటీవల ప్రకటించారు. ఇందులో భారత్ నుంచి రూ.466 కోట్లతో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నాలుగో స్ధానాన్ని దక్కించుకున్నారు.













