డల్లాస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 7వ హోలీ మరియు వనభోజనాలు
హోలీ అనగానే మనకు గుర్తుకువచ్చేది రంగుల కేళి అని!! వసంత ఋతువు ప్రవేశం ప్రకృతిలో సరికొత్త సొగసు తెస్తుంది అందుకు తార్కాణమే చిగురించే చెట్లు, పక్షుల కమ్మని స్వరాలు మనలో కొత్త ఉత్సాహాన్ని పెంచుతాయి, అందుకే భారతీయ సంస్కృతిలో హోలీ పండుగ ఎంతో ప్రత్యేకమైనది। కుల మాత జాతి వివక్ష లేకుండా పిల్లలు పెద్దలు కలిసి అనురాగ ఆప్యాయతలు కలిసిన రంగులను జల్లుకునే పండుగ ఈ హోలీ పండుగ భిన్నత్వంలో ఏకత్వం చూపించే పండుగే ఈ హోలీ పండుగ.
డల్లాస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ (డేటా) నిర్వహించిన 7వ హోలీ మరియు వనభోజనాలు, స్థానిక లెవిస్విల్లే లేక్ పార్క్ లో మార్చి 16 న భాస్కర్ ఎర్రోజు (డేటా అధ్యక్షుడు) ఆధ్వర్యం లో ఎంతో అంగ రంగ వైభముగా మరియు కన్నుల పండుగగా జరిగింది. దాదాపు 2000 మంది స్థానిక డల్లాస్ వాసులు ఈ కార్యక్రమములో పాల్గొని రంగులతో పిల్ల పాపలతో మరియు బంధు మిత్రులతో కలిసి ఆనంద డోలికల్లో తేలియాడారు.
డేటా కార్యవర్గం మరియు వాలంటీర్లు గత 4 వారాలుగా ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని చక్కగా రూపుదిద్దారు. ఉచితంగా రంగులు పంచడం జరిగింది. కమ్మని తెలంగా వంటలు వండి విచ్చేసిన జనానికి వడ్డించడం జరిగింది.
డేటా తరుపున జరిగే ఈ హోలీ మరియు వనభోజనాలకు తమ సహాయాన్ని అందించిన దాతలందరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు!
ఈ పండుగకు మాత్రమే కాకుండా, డేటా నిర్వహించిన పలు కార్యక్రమాలకు ఆర్థిక మరియు ఇతర సహాయ సహకారాలు అందించిన వ్యాపార సంస్థలకు, దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు!!
డేటా ఫౌండేషన్ టీం మరియు కోర్ టీం అందరికి ప్రత్యక ధన్యవాదాలు!
డేటా కార్యవర్గం 2019
భాస్కర్ ఎర్రోజు (ప్రెసిడెంట్) & రఘువీర్ మరిపెద్ది (ఫౌండేషన్ చైర్)
ప్రసన్న డొంగురు (ప్రెసెంట్ ఎలెక్ట్)
ప్రవీణ్ ఎక్కాటి (సెక్రటరీ)
సతీష్ నాన్ద్రే (ట్రేసరీ)
మహేష్ మానాపురి (జాయింట్ సెక్రటరీ)
వెంకట్ బొమ్మ (జాయింట్ ట్రేసరీ)













