కాలిఫోర్నియాలో వైభవంగా ఎఐఎ ‘దసరా, దీపావళి ధమాకా’ సంబరాలు
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్ (ఎఐఎ), బాలీ 92.3 ఆధ్వర్యంలో ‘దసరా, దీపావళి ధమాకా’ సంబరాలు ఘనంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని ప్లెజంటాన్లో ఉన్న అలమెడా కౌంటీ ఫెయిర్‌గ్రౌండ్ వేదికగా ఈ సంబరాలు నిర్వహించారు. బేఏరియాకు చెందిన 45కుపైగా భారతీయ ఆర్గనైజేషన్లు అన్నీ కలిసి ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద దీపావళి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాయి. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహించిన ఈ ఉత్సవాలకు 20 వేలమందికిపైగా ప్రజలు హాజరవ్వడం విశేషం. ఈ సంబరాల్లో భాగంగా 25 అడుగుల అయోధ్య రామమందిరం, 40 అడుగుల రావణాసురుడి బొమ్మను ఏర్పాటు చేశారు. ఈ భారీ రావణ దహనం, బాణాసంచాలతో వేడుకలు వైభవంగా ముగిశాయి.
అలమెడా కౌంటీ సూపర్వైజర్ డేవిడ్ హ్యూబర్ట్, ఇండియా కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి, మేయర్ కర్ల బ్రౌన్, అసెంబ్లీ మెంబర్స్ లిజ్ ఓర్టెగా, అలెక్స్ లీ, అలమెడా కౌంటీ సూపర్వైజర్స్ ఎలిసా మార్కీజ్, లీనా ట్యామ్, మేయర్ కామెరన్ మోంటానో (మిలిపిటాస్), అసెంబ్లీ మెంబర్ మియా బోంటా, అలెక్స్ లీ, ఓర్టెగా, మేయర్ జాన్ మర్చంద్ (లివర్మోర్), మేయర్ లిలీ మే (సిటీ ఆఫ్ ఫ్రెమాంట్), మేయర్ మైఖేల్ మెక్కారిస్టన్ (సిటీ ఆఫ్ డబ్లిన్), కౌన్సిల్మెంబర్స్ రాజ్ సల్వాన్, శ్రీధర్ వెరోసె, కెప్టెన్ రాయ్ గామెజ్ (ప్లెజంటాన్ పోలీస్ డిపార్ట్మెంట్) తదితరులంతా ఈ వేడుకల్లో పాల్గొని, ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కాంగ్రెస్‌మ్యాన్ రో ఖన్నా, ఎరిక్ స్వాల్వెల్, రెబెకా బార్ కహాన్ డిస్ట్రిక్ స్టాఫ్ కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ ఈవెంట్ యొక్క గ్రాండ్ స్పాన్సర్ సంజీవ్ గుప్తా సిపిఎ (ఫైర్ వర్స్), డాక్టర్ ప్రకాష్ అద్వానీ (రావన్ దహన్)తోపాటు రియల్టర్ నాగరాజ్ అన్నయ్య, లుర్నిగో (విద్యా భాగస్వామి), ట్రావెలోపాడ్, జీ5 (ఎక్స్‌క్లూజివ్ స్ట్రీమింగ్ పార్టనర్), ఆన్‌షోర్ కరే, కార్డియా (అలివ్కోర్ ఇంక్), తాజ్‌మహల్ రెస్టారెంట్, ఇన్‌స్టా సర్వీస్, ఆజాద్ ఫైనాన్షియల్స్, ఫ్రెష్ మీట్ ఫ్యాక్టరీ, రియల్మ్ రినోవేషన్స్, తనిష్క్ యుఎస్ఎ, భాను మాంగోస్ అండ్ థియస్ జ్యువెలర్స్ అండ్ దేశీ ఫేవర్స్. మీడియా భాగస్వాములలో ఎన్బిసి బే ఏరియా న్యూస్, విరిజల్లు రేడియో, యో ఇండియా టీవి, టీవీ 9 తెలుగు టైమ్స్ ఉన్నాయి.
అయోధ్య రామ్ మందిర్ (25 అడుగుల ప్రతిరూపం), ఉత్తర అమెరికాలో అతిపెద్ద రావణుడి దిష్టిబొమ్మ (40 అడుగులు) చెడుపై విజయాన్ని సూచించడానికి దహనం చేయబడింది. అలాగే, ఈ దీపాల పండుగ సందర్భంగా అద్భుతమైన బాణాసంచా ప్రదర్శించారు. రోజంతా జరిగిన కార్యక్రమంలో, లక్ష్మీ దేవికి ‘‘మహా మంగళ్ హారతి’’, సంప్రదాయ ప్రార్థనలు/పూజలు జరిగాయి. అలాగే, పెద్ద సంఖ్యలో భక్తులు ‘‘రథయాత్ర’’లో పాల్గొని రథాన్ని లాగారు. బాణసంచా కాల్చిన తర్వాత, డిస్కో దాండియా ఈవెంట్ ముగిసే వరకు కొనసాగింది, ఇందులో అన్ని వయసుల వారు చురుకుగా పాల్గొన్నారు. ప్రముఖ గాయకుల ప్రత్యక్ష సంగీత కచేరీ ఆకట్టుకుంది. దుస్తులు/నగలు/గృహ అలంకారాలు/రియల్ ఎస్టేట్/ విద్యా బూత్‌లు వంటి ఆకర్షణీయమైన షాపింగ్ స్టాల్‌తో వేదిక నిండిపోయింది. రంగోలి పోటీలు/క్యారమ్స్/చెస్ పోటీలు మరియు కార్నివాల్ గేమ్స్ లకు చాలా మంది హాజరైనారు. ‘‘గ్రేట్ ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్’’ వేదిక వద్ద స్థానిక రెస్టారెంట్లు అందించే వివిధ రకాల ఆహారాన్ని అందించారు. కిడ్స్ ప్లే ఏరియాలో అందుబాటులో ఉన్న వివిధ రకాల గేమ్‌లను చిన్న పిల్లలు ఆడారు. కుటుంబాలు కూడా రామ్ లీలాలో పెద్దఎత్తున పాల్గొన్నాయి.
ఈ వేడుకలు విజయవంతం కావడం పట్ల ఎఐఎ బృందం సంతోషాన్ని వ్యక్తం చేసింది. భారతీయ కమ్యూనిటీ సభ్యులందరూ ఈవెంట్‌ను గ్రాండ్‌గా విజయవంతం చేయడంలో సహకరించారని అందరికీ ఇందులో పాల్గొన్న సంఘాలకు కూడా ఎఐఎ టీమ్ ధన్యవాదాలను తెలిపింది.







