డెన్మార్క్ ప్రధాని పెళ్లి మళ్లీ వాయిదా
జూలైలో జరగాల్సిన తనపెళ్ళిని డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సెన్ వాయిదా వేసుకున్నారు. ఆమె తన ప్రియుడు టెన్ బర్గ్ తో పెళ్లిని ఇప్పటికే కరోనా కారణంగా రెండు సార్టు వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ (ఈయూ) కౌన్సిల్ సమావేశాల కారణంగా ఆమె తన పెళ్ళిని మళ్లీ వాయిదా వేసుకున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు చర్చించేందుకు ఈ యూ కౌన్సిల్ సమావేశాలను జులైలో మొదటి వారంలో ఏర్పాటు చేశారు. సరిగ్గా అదే రోజు తమ పెళ్ళి ముహూర్తం కావడంతో ఆమె పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ప్రజల కోసం చర్చించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్బుక్లో ప్రకటించారు.













