అక్కినేని జన్మదిన వేడుకల్లో దాము గెదెల
అమెరికాలో తెలుగు భాషకు, సంస్కృతికి విశేషంగా సేవలందిస్తున్న న్యూజెర్సి తెలుగు ప్రముఖులు దాము గెదెల హైదరాబాద్ పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డా. అక్కినేని జన్మదిన సినీ పురస్కార ప్రదాన కార్యక్రమం శ్రీ త్యాగరాయ గానసభలో ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ నటులు సుమన్‌కు అక్కినేని జన్మదిన సినీపురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విదేశీ ప్రముఖునిగా దాము గెదెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు దాము గెదెల అమెరికాలో చేస్తున్న తెలుగు భాషా సేవను ప్రశంసించారు.
సుందరయ్య కళా నిలయంలో జరిగిన మరో వేడుకల్లో కూడా దాము గెదెల పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఘంటసాల సంగీత కళాశాల వ్యవస్థాపక అధ్యక్షుడు, ఘంటసాల స్వర పరిశోధకుడు డా. శరత్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన రాగమయి రావే అనురాగమయి రావే పేరుతో నిర్వహించి సంగీత కార్యక్రమంలో దాము గెదెల పాల్గొని మాట్లాడారు. అక్కినేని గొప్ప నటుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు సుమన్, లయన్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.













