టీపాడ్ 2019 నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
డల్లాస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) 2019 నూతన కార్యవర్గ బృందం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా ముగిసింది. టీపాడ్ 2019 కమిటీ ఎన్నుకోబడిన కొత్త కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార సభ ప్లేనో నగరంలోని మినర్వా బాన్వ్కెట్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. డల్లాస్ ప్రాంతీయులు, అన్ని స్థానిక, తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా డాలస్ చిన్నారులు అవని సుంకిరెడ్డి, సిందూరి కోడూరి, నిగమా రెడ్డి కొండ ప్రార్థన మరియు అమెరికా, భారత దేశం జాతీయ గీతాలు ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.













