వైభవంగా జరిగిన డాటా బతుకమ్మ వేడుకలు
డల్లాస్ ఏరియా తెలంగాణ సంఘం (డాటా) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. టెక్సాస్‌లోని పార్కర్‌లో ఉన్న సౌత్ ఫోర్స్ రాంచ్లో జరిగిన ఈ వేడుకల్లో ఎంతోమంది మహిళలు, చిన్నారులు, పెద్దలు పాల్గొన్నారు. ఔట్‌డోర్‌లో జరిగిన ఈ వేడుకల్లో దుర్గా పూజ, బతుకమ్మ నిమజ్జనం వంటివి అంగరంగ వైభవంగా జరిగాయి. డా. సుధ కల్వగుంట ఆధ్వర్యంలో స్థానిక విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సాహిత్య ఈ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి. పట్నాయక్ ఆధ్వర్యంలో గీతా మాధురి, శ్రీకాంత్, అఖిల పాడిన పాటలు అందరినీ ఉత్సాహపరిచాయి. అందమైన బతుకమ్మలకు ప్రైజ్‌లను కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ డాటా కార్యవర్గం ధన్యవాదాలు తెలియజేసింది.













