ఆటాలో దాజీ మెడిటేషన్ కార్యక్రమం
ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్‌గా పేరు పొందిన హైదరాబాద్‌కు సమీపంలో నందిగామ మండలంలో సుమారు 1,400 ఎకరాల్లో కన్హా శాంతివనంలో ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి మెడిటేషన్, ఇతర విషయాలను బోధిస్తున్న కమలేష్ డి. పటేల్ (దాజీ) అట్లాంటాలోని ఆటా మహాసభల్లో కూడా మెడిటేషన్ విషయాలపై బోధనలు చేయనున్నార్ు. ధ్యానం ద్వారా ఆరోగ్యం, ఏకాగ్రతను పెంపొందించు కోవచ్చని చెప్పే దాజీ శ్రీరామచంద్ర మిషన్, హార్ట్ ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్టులను ఏర్పాటు చేసి వేలాదిమందికి మెడిటేషన్ విషయాలను బోధిస్తున్నారు.
* అట్లాంటా జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్లో జూన్ 7 నుండి 9వ తేదీ వరకు హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ నిర్వహించే కార్యక్రమాల్లో ఎన్నారైలను ఆహ్వానించి, ఆయనతో కలిసి ధ్యానం చేసే అపూర్వ అవకాశాన్ని ఆటా ఈ మహాసభల ద్వారా కల్పించింది. ఈ మహాసభలకు దాజి ప్రధాన వక్తగా హాజరవుతున్నారు.
* ఈ మెడిటేషన్ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శుక్రవారం, జూన్ 7వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. 5 గంటలకు గ్రూపు మెడిటేషన్ కార్యక్రమం జరుగుతుంది. జూన్ 8వ తేదీ ఉదయం 9:00 గంటలకు గ్రూప్ మెడిటేషన్ కార్యక్రమం జార్జియా బాల్రూమ్లో జరుగుతుంది. 10 నుంచి 10.30 వరకు ఆటా ఆడిటోరియంలో కార్యక్రమాలు ఉంటాయి. 12 నుంచి 12.45 వరకు గ్రూపు మెడిటేషన్, మధ్యాహ్నం 2.15 నుంచి 3 వరకు వై మెడిటేట్?, ఎ డాక్టర్స్ పర్పెస్టివ్ కార్యక్రమం, 3.15 నుంచి 3.45 వరకు స్ట్రాంగర్ టుగెదర్ (ఇంటరాక్టీవ్ సెషన్), 4 నుంచి 4.30 వరకు మెడిటేషన్, స్లీప్, హెల్తీ అంశాలపై కార్యక్రమం, 4.30 నుంచి 4.45 వరకు ముద్ర, ప్రాణాయామాలతో ఆరోగ్యం, 5 నుంచి 5.45 వరకు గ్రూపు మెడిటేషన్ ఉంటుంది.
* జూన్ 9న ఉదయం 9 గంటలకు గ్రూపు మెడిటేషన్, 10.45 నుంచి 11.45 వరకు నైదర్ హియర్ నార్ దేర్ కార్యక్రమం, మధ్యాహ్నం 12 నుంచి 12.45 వరకు గ్రూపు మెడిటేషన్, 2.30 నుంచి 3 వరకు కల్టివేట్ క్లారిటీ, 3.15 నుంచి 3.45 వరకు హార్ట్‌ఫుల్ కమ్యూనికేషన్, 4 నుంచి 4.30 వరకు చైర్ యోగ, సాయంత్రం 5 నుంచి 5.45 వరకు గ్రూపు మెడిటేషన్ కార్యక్రమాలు జరుగుతాయి.







