రికార్డు బద్దలుకొట్టిన అమెరికా మహిళ
సైకిల్‌పై ఎంత వేగంగా వెళ్లగలం? ఎంత కష్టపడినా గంటకు వంద కిలోమీటర్లు దాటం కష్టమే. కానీ ఈ ఫొటోలో ఉన్న మహిళ గంటకు 296 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి రికార్డులు బద్దలుకొట్టింది. అమెరికాకు చెందిన ముల్లెర్ కోరెనక్ (45) ఉటాహ్‌లో ఈ రికార్డు సృష్టించింది. ఇందుకోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన రేస్ కార్ సాయం తీసుకున్నారు. మొత్తం 8 కిలోమీటర్ల రేసులో మూడున్నర కిలోమీటర్లు వేగాన్ని అందుకునేందుకు రేసు కారు సాయం తీసుకోగా, మిగత నాలుగున్నర కిలోమీటర్లు స్యయంగా సైకిల్ తొక్కుతూ 296 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంది. గతంలో సైకిల్‌పై అత్యధిక వేగం 268 కిలోమీటర్లు. డచ్ రైడర్ ఫ్రెడ్ రోంపెల్బర్గ్ పేరుతో రికార్డు ఉండేది.













