నవంబరులో మళ్లీ కరోనా!
కరోనా వైరస్ వల్ల ఇప్పటికే ప్రపంచం వణికిపోతోంది. వేలాది మంది చనిపోతుంటే లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ మహమ్మారి ఎప్పుడెప్పుడు కనుమరుగు అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే నవంబరులో మరోసారి కరోనా వచ్చే అవకాశం ఉందంటూ చైనా పరిశోధకులు చెబుతున్న మాటలు సర్వత్రా భయాందోళనలకు గురి చేస్తున్నాయి. చైనా షాంఘైలో కోవిడ్-19 నిపుణుల బృందానికి నేతృత్వం వహిస్తున్న జాంగ్ వెన్ హాంగ్ వచ్చే చలికాలంలో చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా రెండోసారి కరోనా రావచ్చని హెచ్చరిస్తున్నారు. అంటువ్యాధిని పూర్తిగా నియంత్రించడం దీర్ఘకాలంలోనే సాధ్యమని, ఈ లోపు కొంత విరామం ఉండొచ్చని అంటున్నారు. అయితే చైనా ఇప్పటికే కరోనాను నియంత్రించడంలో ఈసారి అనుభవం సాధించినందువల్ల ఈసారి కఠినమైన నిబంధనలు విధించాల్సిన అవసరం ఉందని చెప్పారు.













