హెచ్ 1బీ వీసాలపై ప్రభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. భారతీయులు ఎక్కువగా హెచ్ 1బీ వీసాలకే దరఖాస్తు చేస్తారు. ఈ వీసాలు ఇమ్మిగ్రెంట్ వీసాల కిందకు రావు. అవి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు. అయితే, ట్రంప్ అమెరికన్ల ఉద్యోగాలను కాపాడే ఉద్దేశంతోనే వేటు ప్రకటన చేశారు కాబట్టి నాన్ ఇమిగ్రెంట్ వీసాలైన హెచ్ 1బీ వీసాల పైనా వేటుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. వారం క్రితం నాటి గణాంకాల ప్రకారం అమెరికాలో 2.2 కోట్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ గణాంకాలు అమెరికా చరిత్రలోనే అత్యధికం.













