అమెరికాలో పరిస్థితి తీవ్రతరమయ్యే అవకాశం
అమెరికాలో కరోనా బారినపడ్డ చిన్నపిల్లల సంఖ్య ఊహించిన దానికన్నా అధికంగా ఉందని, భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశం ఉందని అమెరికాకు చెందిన పరిశోధకుల బృందం జరిపిన ఓ అధ్యయనం వెల్లడించింది. కొవిడ్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో ఒక్కో ఐసీయూ బెడ్‌కు 2,381 మంది పిల్లలు పోటీపడే పరిస్థితులు ఏర్పడతాయని తెలిపింది. ఇక్కడ మార్చి 18- ఏప్రిల్ 6 మధ్య 74 మంది పిల్లలు కరోనాతో ఐసీయూల్లో చేరారని, భవిష్యత్తులో ఇదే కాలపరిమితిలో 1,76,190 మంది పిల్లలు ఐసీయూల్లో చేరతారని అంచనా వేసింది. ఈ మేరకు ఐసీయూల సంఖ్య పెంచాలని సూచించింది. 202 చివరిదాకా ఇదే ఉధృతి కొనసాగి అమెరికా జనాభాలో 25 శాతం మంది కరోనా బారినపడితే, అందులో కనీసం 50 వేల మంది పిల్లలు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల పాలయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది.













