అమెరికాకు కాస్త ఊరట…
కరోనా విశ్వమారి కోరల్లో చిక్కుకొని నెల రోజులుగా తల్లడిల్లుతున్న అమెరికాకు కాస్త ఊరట లభిస్తున్నది. వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండడం.. వారం రోజులుగా కొత్త కేసుల నమోదు మందగించడంతో అమెరికన్లు హమ్మయ్యా… అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇప్పటివరకు అమెరికాలో 6.22 లక్షల కేసులు నమోదుకాగా 27 వేలకుపైగా ప్రజలు మరణించారు. 38 వేల మంది కోలుకున్నారు. ప్రధానంగా న్యూయార్క్ రాష్ట్రం ప్రాణాంతక కరోనా వైరస్‌కు అడ్డగా మారగా, న్యూజెర్సీ, మసాచుసెట్స్, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ తదితర రాష్ట్రాల్లో భారీ నష్టం సంభవించింది. అత్యధికంగా న్యూయార్క్‌లో రెండు లక్షలకుపైగా కేసులు 10,800కి పైగా మరణాలు సంభవించాయి. 14 రాష్ట్రాల్లో పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.













