చైనాను మించిన న్యూయార్క్
అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగరం కరోనాకు అడ్డాగా మారింది. ఒక్క నగరంలోనే బాధితుల సంఖ్య లక్ష దాటింది. చైనా, బ్రిటన్ కన్నా ఈ సంఖ్య చాలా ఎక్కువ. న్యూయార్క్ అధికారుల సమాచారం ప్రకారం నగరంలో ఆదివారం ఒక్కరోజే 5,695 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 1,04,410కు పెరిగింది. మృతుల సంఖ్య 6,898గా నమోదైంది. అమెరికా మొత్తం కేసుల్లో 20 శాతం కేసులు న్యూయార్క్‌లోనే తేలాయి. రాష్ట్రంలో కరోనా ఒక్కరోజులోనే 758 మందిని పొట్టన పెట్టుకున్నదని న్కూయార్క్ గవర్నర్ ఆండ్యూ క్యూమో పేర్కొన్నారు. ఓవైపు కరోనా విజృంభిస్తున్నదని చెప్తూనే ఆర్థిక కార్యకలాపాలను పున ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.













