న్యూయార్క్ కుదుటపడింది!
దేశంలో ఆంక్షలు విధించడం చాలా కిష్టమైన అంశం. గతంలో ఎప్పడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. అయితే, ఇది మంచి ఫలితం ఇస్తోంది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాకు తెలిపారు. కరోనా మహమ్మారికి కేంద్ర స్థానంగా ఉన్న న్కూయార్క్ ఇప్పుడిప్పుడే కుదటపడుతోందని, కొత్త కేసులు నమోదు కావడం లేదన్నారు. ఆంక్షల ఎత్తివేత్తపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని, మే తొలి వారంలో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని అధ్యక్ష భవనం వర్గాలు తెలిపాయి. మరోపక్క నేవీలోని 4800 మంది సిబ్బందిలో 550 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు.













