2021కి కరోనా అంతం : బిల్ గేట్స్
వచ్చే ఏడాది నాటికి దాదాపు అన్ని దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతుందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ త్వరలోనే అందరికి అందుబాటులోకి వస్తుందని అన్నారు. 2022 కల్లా వైరస్ ప్రభావం పూర్తిగా తొలగిపోతుందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక నష్టం నుంచి ఇప్పట్లో తిరిగి కోలుకునే పరిస్థితులు లేవన్నది వాస్తవం. వైరస్‌పై పోరులో భాగంగా కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, నూతన చికిత్సా విధానం, వ్యాక్సిన్ తయారీ, పరిశోధనలు వంటి అంశాల్లో కీలక అడుగులు పడుతున్నాయి. వీటి వల్లనే మనం ధనిక ప్రపంచంలోనే ఉన్నామనే భావన నాకు కలుగుతుందన్నారు. 2021 నాటికి మహమ్మారి ప్రభావం తగ్గించగలిగితే, 2022 చివరికి ప్రపంచం నుంచి పూర్తి స్థాయిలో వైరస్ తొలగిపోతుంది అని అన్నారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కీలకంగా వ్వవహరిస్తున్న సంగతి తెలిసిందే.













