అమెరికాలో ఒక్కరోజే 2,129 మరణాలు
కరోనా మహమ్మారి అమెరికాను మృత్యుపాశంలా వెంటాడుతోంది. వైరస్ బారిన పడి ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య తాజాగా 25 వేలు దాటింది. ఇప్పటి వరకు నమోదైన మరణాల్లో మంగళవారమే అత్యధికంగా సంభవించాయి. ఇక వైరస్ సోకిన వారి సంఖ్య ఆరు లక్షలు దాటింది. మంగళవారం అగ్రరాజ్యంలో 2,129 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు నమోదైన ఒక్కరోజు మరణాల్లో ఇదే అత్యధికం. దీంతో అక్కడ మృతుల సంఖ్య 25,981కి పెరిగింది. ఇక ఇప్పటి వరకు 6,05,000 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్లో మరణాల సంఖ్య 10,842కు పెరిగింది. బాధితుల సంఖ్య 2,03,020కు చేరింది. వైరస్ పై చేస్తున్న పోరులో క్రమంగా పురోగతి సాధిస్తున్నామని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కంటి కనపడి శత్రువుతో పోరాడి మరణించిన వారి త్యాగాలను వృథా పోనివ్వమని వ్యాఖ్యానించారు.













