లాక్‌డౌన్‌ను తాము భరించలేం!
కరోనా వ్యాప్తికి అడ్డుకట్టు వేయడానికి విధించిన లాక్‌డౌన్‌ను తాము భరించలేమని, వెంటనే ఆంక్షల్ని వెత్తివేయాలని పలు దేశాల్లో ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలు నమోదైన అమెరికాలో సైతం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిరసనలను ప్రోత్సహిస్తున్నారు. అమెరికాలో కొవిడ్ 19 మృతుల సంఖ్య అర కోటి దాటిన, లాక్‌డౌన్‌ను ఉపసంహరించేందుకు కొన్ని రాష్ట్రాలు తెరలేపాయి. సౌత్ కరోలినా, జార్జియా, ఓక్లహామా, అలస్కా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఆంక్షల్ని లెక్కచేయకుండా కాలిఫోర్నియాలో వందల మంది బీచ్‌లకు పోటెత్తారు.













