అమెరికాలో కరోనా కల్లోలం
అమెరికాను కరోనా వైరస్ కలవరపరుస్తోంది. ఆ దేశంలో కొవిడ్-19 కారణంగా ఓవైపు మరణాలు, మరో వైపు నిర్ధారిత కేసుల సంఖ్య పెరుగతూపోతుంది. మూడు రోజుల వ్యవధిలోనే మృతుల సంఖ్య ఆరుకు చేరింది. పాజిటివ్ కేసులు 90 దాటాయి. పరిస్థితుల రీత్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఫార్మా రంగా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఉద్యోగికి కరోనా సోకిందనే వార్తతో వాషింగ్టన్‌లోని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కార్యాలయాన్ని మూసివేశారు. ప్రవాస భారతీయురాలు సీమా వర్మ ను వైట్‌హౌస్ కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్ లో సభ్యురాలిగా ట్రంప్ నియమించారు.













