45 నిమిషాల్లోనే కరోనా ఫలితం
కేవలం 45 నిమిషాల్లోనే కరోనా ఉందో, లేదో తేల్చేసే సరికొత్త పరీక్షా విధానాన్ని అమెరికాలోని సాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దానికి సార్స్ సీఓవీ -2 డిటెక్టర్ అని పేరుపెట్టారు. గొంతు, ముక్కుల్లోని స్రావాల శాంపిళ్లను పరీక్షించడం ద్వారా ఇది ఫలితాన్ని విడుదల చేస్తుంది. అంతేకాదు ఇన్ఫెక్షన్ సార్స్ తరహా కరోనా వైరస్ వల్ల వచ్చిందా? కొవిడ్ 19కు కారణమయ్యే సార్స్ సీఓవీ 2 రకం వైరస్లవల్ల వచ్చిందా? అనేది కూడా అత్యంత కచ్చితత్వంతో నిర్థారిస్తుంది. సీఆర్ఐఎస్పీఆర్ జీన్ టార్గెటింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించిన తొలి కరోనా నిర్థారణ పద్థతి ఇదేనని శాస్త్రవేత్తలు వెల్లడించారు.













